Ka: సైకిల్‌పై హీరోయిన్స్‌తో ప్రెస్‌మీట్‌కు వచ్చిన హీరో

The hero came to the press meet with the heroines on a bicycle
  • 'క' ప్రెస్‌మీట్ కు సైకిల్‌పై వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం 
  • తన కెరీర్‌లో 'క' స్పెషల్‌ చిత్రంగా నిలుస్తుందన్న కిరణ్‌ 
  • క్లైమాక్స్‌ హైలైట్‌ అంటున్న దర్శకుడు
ఈ రోజుల్లో  సినిమాలు ప్రేక్షకులకు రీచ్‌ కావాలంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌ కంటెంట్‌తో పాటు ఇన్నోవేటివ్‌ ప్రమోషన్స్‌ కావాలి. ముఖ్యంగా చిన్న సినిమాల చిత్ర యూనిట్లు ఈ విషయంలో ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'క' టీమ్‌ కూడా ఆ బాటలోనే వెళుతోంది. 

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'క'. పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి  సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మాత. ఈ నెల 31న చిత్రం విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ ఎగ్రెసివ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి చిత్ర హీరో, హీరోయిన్స్‌ సైకిల్‌పై విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రెస్‌మీట్‌ వేదికగా నిలిచిన ప్రసాద్‌ ల్యాబ్‌లో హీరో, హీరోయిన్స్‌ సైకిల్‌పై సవారి చేశారు. 

ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ఈ చిత్రంలో అందరూ కొత్త కిరణ్ అబ్బవరంను చూడబోతున్నారని తెలిపారు. "ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే 'క'మరో ఎత్తు. నా కెరీర్‌లో మంచి విజయవంతమైన చిత్రంగా ఇది నిలుస్తుందనే నమ్మకం ఉంది. చాలా స్ట్రాంగ్‌ కంటెంట్‌తో ఈ సినిమా చేశాను. 

ఈ చిత్రంలో ఉండే ట్విస్టులు అందరిని అలరిస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ఇరవై నిమిషాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులందరూ 'క'లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు" అన్నారు. ఈ సినిమా చూసిన అందరూ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో బయటకి వెళతారని, 'క' చిత్రం ఎవరిని నిరాశపరచదని దర్శకుల్లో ఒకరైన సుజిత్‌ తెలిపారు. 
Ka
Kiran abbavaram
Ka pressmeet
Nayan Sarika
Tanvi Ram
Cinema

More Telugu News