Nara Lokesh: అమెరికాలోనూ మంత్రి నారా లోకేశ్‌కు అభిమానుల తాకిడి!
- ఓ వైపు ఇన్వెస్టర్లతో వరుస భేటీలు.. మరో వైపు పార్టీ కేడర్‌తో ఫొటోలు
- అభిమానులను నిరాశపరచకుండా ఫొటోలు దిగిన నారా లోకేశ్
- శాన్ ఫ్రాన్సిస్కోలో బిజీబిజీగా గడిపిన మంత్రి
పెట్టుబడుల ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడ కూడా అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒకవైపు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో క్షణం తీరికలేకుండా బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను పలకరించారు. వారిని నిరాశ పరచకుండా ఫొటోలు దిగారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో మంత్రి బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ వద్దకు సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వారి కోరిక మేరకు మంత్రి లోకేశ్ వారితో ఫొటోలు దిగారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సాధకబాధకాలను తెలుసుకున్నారు.
ఇదిలావుంచితే, 2వ రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సీటీవో ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటామిక్స్ సీఈవో డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండీ నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సీఎఫ్‌వో ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ ముఖాముఖ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను వారికి వివరించారు.