Venkatesh: దిల్‌ రాజు రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయని హీరో వెంకటేశ్!

Hero Venkatesh who did not accept Dil Rajus request
  • గేమ్‌ ఛేంజర్‌తో పాటు సంక్రాంతి బరిలో వెంకటేశ్ సినిమా
  • ఈ రెండు చిత్రాలను నిర్మిస్తున్న దిల్‌ రాజు 
  •  ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామాగా వెంకీ సినిమా


సాధారణంగా సినిమాలకు సంక్రాంతి సీజన్‌ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తుంటారు నిర్మాతలు. ముఖ్యంగా అగ్రహీరోలు, యువ క్రేజీ కథానాయకులు తమ సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. 2025 సంక్రాంతికి కూడా ఈ పోటీ ఉంది. మొదట్లో చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రాన్ని సంక్రాంతికి జనవరి 10న విడుదల చేయాలని అనుకున్నారు నిర్మాతలు. అయితే చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు పెండింగ్‌ ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు.

 ఇక ఇప్పటి వరకు సరైన విడుదల డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం 'విశ్వంభర' సంక్రాంతి ప్లేస్‌ను భర్తీ చేసింది. అయితే 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌ రాజు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా 'సంక్రాంతికి  వస్తున్నాం' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందు నుంచి కూడా ఈ చిత్రం సంక్రాంతినే టార్గెట్‌ చేసింది. కాగా ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్‌లో దిల్‌ రాజు సంస్థ నుండే రెండు చిత్రాలు వస్తున్నాయి. 

అయితే తన చిత్రానికి తానే పోటీగా ఉండటం ఇష్టం లేని దిల్ రాజు... వెంకటేశ్ చిత్రాన్ని వాయిదా వేయాలని దర్శకుడు, హీరోను రిక్వెస్ట్‌ చేశాడని తెలిసింది. కానీ అనిల్‌ రావిపూడితో పాటు హీరో వెంకటేశ్ కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని సమాచారం. సంక్రాంతి లాంటి మంచి సీజన్‌ను వదులుకోవడం తమకు ఇష్టం లేదని నిర్మాతకు చెప్పారట. దాదాపు తొంబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవల డబ్బింగ్‌ పనులు కూడా ప్రారంభించింది. 

ఐశ్వర్య రాజేశ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, హీరో వెంకటేశ్ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించబోతుంది. ఈ ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామాకు తన మార్క్‌ వినోదాన్ని జోడించి అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 


Venkatesh
Dil Raju
Game changer
VenkyAnil03
Venkatesh Daggubati
Anil ravipudi
Cinema

More Telugu News