Andhra Pradesh: ఏపీలో శాప్ నెట్ మూసివేత
- ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ
- 2018లో శాప్ నెట్‌ను ఏర్పాటు చేసిన టీడీపీ సర్కార్
- ఈ కార్యక్రమంలో భాగంగా మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు
ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సొసైటీ ఫర్ ఏపీ నెట్‌వర్క్ (శాప్ నెట్)ను మూసివేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఆస్తులు, సిబ్బంది, అప్పులను ఉన్నత విద్యా మండలికి బదలాయించింది.
కాగా, 2018లో శాప్ నెట్‌ను అప్పటి టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన టీవీ ద్వారా విద్యారంగానికి సేవలు అందించింది. ఇప్పుడు ఈ విభాగాన్ని మూసివేసి, నేరుగా విద్యామండలి నుంచే సమర్థవంతంగా సేవలందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.