Viral News: మ్యాట్రిమోనియల్ పెళ్లి సంబంధంలో ట్విస్ట్... నవంబర్‌లో జరగాల్సిన ఎంగేజ్‌మెంట్ రద్దు

Woman rejects Matrimonial match after knowing man salary is Rs 3 lakh per year not Rs 30 lakh

  • అసలు జీతం రూ.30 లక్షలు కాదు.. రూ.3 లక్షలని నిజం చెప్పిన యువకుడు
  • టైపింగ్ మిస్టేక్ కారణంగా సున్నా ఎక్కువ పడిందని వెల్లడి
  • నిజం తెలిసి తిట్ల దండకం మొదలుపెట్టిన యువతి

మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరి గురించి ఒకరు తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి. మ్యాట్రిమోనియల్ వివరాల ప్రకారం యువకుడి జీతం ఏడాదికి రూ.30 లక్షలు. దీంతో సంబంధం ఎక్కడ చేజారుతుందోనన్న భయంతో త్వరగా ఎంగేజ్‌మెంట్ చేసుకుందామంటూ యువతి కంగారు పెట్టింది. ఇంకా ఆలస్యం చేస్తే వేరే సంబంధం చూసుకుంటానంటూ త్వరపెట్టింది. అయితే రెండవ పెళ్లి కావడంతో మరికొంత సమయం తీసుకోవాలని యువకుడు సలహా ఇచ్చాడు. మొత్తానికి ఇద్దరూ వడివడిగా నవంబరులో ఎంగేజ్‌మెంట్ దిశగా అడుగులు వేస్తున్న వేళ అసలైన ట్విస్ట్ జరిగింది.

మ్యాట్రిమోనియల్ వివరాలలో తన జీతం తప్పుగా ఉందని, టైపింగ్ మిస్టేక్ కారణంగా ఏడాదికి రూ.3 లక్షలు ఉండాల్సిన చోట రూ.30 లక్షలు అని తప్పుగా కనిపిస్తోందని అతడు చెప్పాడు. దీంతో సదరు యువతి... యువకుడిని తిట్టడం మొదలుపెట్టింది. సంబంధం రద్దు కావడంతో వాళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సప్ స్క్రీన్‌షాట్లను యువకుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
 
కిష్ సిఫ్ అనే యువకుడు ఈ పోస్ట్ పెట్టాడు. తాను ఒక పురుషుల హక్కుల కార్యకర్తనని, పురుషుల హక్కుల గ్రూప్ అయిన ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్‌’లో తాను పనిచేస్తున్నానని, బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తుంటానని చెప్పాడు. ఇటీవల తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటున్నానని వివరాలు వెల్లడించాడు. తన అసలైన జీతం తెలుసుకున్న తర్వాత సదరు మహిళ ఆవేశానికి గురైందని, తనను తిట్టడం మొదలుపెట్టిందని చెప్పాడు. 

సదరు యువతి నేపథ్యం గురించి తెలుసుకోగా.. ఆమె తన మాజీ భర్త నుంచి ఏకంగా రూ.80 లక్షలు భరణంగా తీసుకొని సెటిల్‌మెంట్ చేసుకున్నట్టు తెలిసిందన్నాడు. ఈ విషయాన్ని తనతో చెప్పకుండా దాచిందని సిఫ్ పేర్కొన్నాడు. తన అసలు జీతం తెలుసుకున్నాక మహిళ తల్లి కూడా తనను వేధించడం మొదలుపెట్టిందని వివరించాడు. తన కూతుర్ని మోసగించబోయావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించిందని అతడు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News