Chandrababu: అభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక... ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు

Girl presented artwork to Chandrababu
  • చంద్రబాబు రేఖా చిత్రం గీసిన 8వ తరగతి విద్యార్థిని
  • సచివాలయంలో చంద్రబాబుకు అందజేత
  • తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్న చంద్రబాబు
ఓ విద్యార్ధిని తన అభిమాన నేత చంద్రబాబును నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. 

తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం నాడు ఆ బాలిక సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘

‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్ధి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చిత్రంపై రాసింది. ఇది చూసి ముగ్ధుడైన చంద్రబాబు లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
Chandrababu
Girl Student
Art Work
TDP
Andhra Pradesh

More Telugu News