AP Floods: ఏపీలో వరద బాధితులకు రేమాండ్ గ్రూప్ రూ.2 కోట్ల భారీ విరాళం
- ఏపీలో సెప్టెంబరు నెలలో భారీగా వరదలు
- లక్షలాది మందిపై వరదల ప్రభావం
- ఇప్పటికీ స్పందిస్తున్న దాతలు
- ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
ఏపీలో వరద బాధితులకు చేయూతనిచ్చేందుకు సహృదయ నేస్తాలు స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి పలువురు చెక్కులు అందించారు. విరాళాలు అందజేసిన వారిలో....
• రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.2 కోట్లు.
• బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, జోనల్ డిప్యూటీ మేనేజర్ సుధాకర్ రూ.1 కోటి.
• గంగవరపు విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రూ.65 లక్షలు
• రాష్ట్రీయ సేవా సమితి తరపున జనరల్ సెక్రటరీ వెంకటరత్నం, జాయింట్ సెక్రటరీ డాక్టర్ మమత, ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, సాయిబాబా రూ.50 లక్షలు
• మద్దిపట్ల కృష్ణ (ఎన్ఆర్ఐ) రూ.10 లక్షలు.
• థామస్య రూ.1 లక్షా 75 వేలు.
• కొర్రపాటి సురేంద్ర రూ.1 లక్షా 50 వేలు.
• తులసీ కృష్ణమూర్తి రూ.1 లక్షా 18 వేలు
• కె.రమేష్ రూ.1 లక్షా 116
• కె.నారాయణ రూ.1 లక్ష
• ఎస్ఎల్ఎన్ శాస్త్రి రూ.70 వేలు
• కోలా మన్మథరావు రూ.50 వేలు
• విజయవాడ పడమటలోని విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్ధులు రూ.50 వేలు
• నరేంద్ర రూ.50 వేలు
• రాజశేఖర్ రూ.50 వేలు
• కోనేరు వెంకటరామ్ రూ.25 వేలు అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు.