union bank: యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాల జాతర

union bank has issued a notification to fill 1500 local bank officer posts
  • జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూనియన్ బ్యాంక్ 
  • 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి చర్యలు
  • తెలుగు రాష్ట్రాలకు 200 చొప్పున పోస్టులు  
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. యూనియన్ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న భారీ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ క్రమంలో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గానూ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1500 పోస్టులను 2024 - 25 ఆర్ధిక సంవత్సరంలో భర్తీ చేయాలని యూనియన్ బ్యాంక్ (యూబీఐ) నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు 200, తెలంగాణకు 200 పోస్టులను కేటాయించింది.  

ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 24వ తేదీన ప్రారంభమయింది. ఆసక్తిగల యువతీయువకులు నవంబర్ 13వ తేదీ వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయసులో ఐదేళ్ల సడలింపు ఇచ్చింది. అలానే ఓబీసీ కేటగిరికి చెందిన వారికి 3, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు పది సంవత్సరాలు వయో పరిమితి సడలింపు వర్తిస్తుందని వెల్లడించింది. 

దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ అభ్యర్ధులు రూ.850లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్ధులు మాత్రం దరఖాస్తు రుసుముగా కేవలం రూ.175లు చెల్లించాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.48,480ల నుంచి రూ.85,920ల వరకు ఉంటుందని తెలిపింది. అర్హులైన అభ్యర్ధులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులై అర్హత సాధించిన వారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయనున్నారు. 

పరీక్షలకు గానూ దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx వెబ్ సైట్‌ని సంప్రదించండి. 
union bank
Job Notifications
Andhra Pradesh
Telangana

More Telugu News