KTR: మంత్రి పొంగులేటి టార్గెట్‌గా కేటీఆర్ కీలక ట్వీట్

brs working president ktr tweet ed raids ponguleti srinivasreddy
  • తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని కేటీఆర్ ఆరోపణ
  • ఈడీ దాడుల తర్వాత ఆదానీతో పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారన్న కేటీఆర్
  • ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్న కేటీఆర్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలపై జరిగిన ఈడీ దాడులను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. 

ఈడీ దాడులు జరిగి నెల రోజులు కావస్తున్నా కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదన్నారు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు కాలేదన్నారు. ఈడీ దాడులు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో ఆదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. 
KTR
Ponguleti Srinivas Reddy
BRS

More Telugu News