Akshay Kumar: అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ దీపావళి కానుక!

Akshay Kumar unique Diwali gift to monkeys in Ayodhya
  • కోటి రూపాయల విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్
  • వానరసేన కోసం ఫీడింగ్ వ్యాన్ ఏర్పాటు చేసిన అక్షయ్ కుమార్
  • భక్తులకు ఇబ్బంది కలగకుండా... 1200 కోతులకు పౌష్ఠికాహారం అందజేత
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఉదారతను చాటుకున్నాడు. దీపావళి కానుకగా అయోధ్యలోని వానరసేనకు రూ.1 కోటి విరాళం ప్రకటించాడు. అయోధ్య రామాలయానికి వచ్చే భక్తులను వానరసేన ఇబ్బంది పెట్టకుండా... అలాగే ఆకలితో ఉన్న వానరసేనకు ఆహారం కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా ఫీడింగ్ వ్యాన్‌ను కూడా పంపించాడు.

అయోధ్య వానరసేనకు అక్షయ్ కుమార్ ఆహారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. బాలరాముడి ఆలయ ప్రారంభం అయినప్పటి నుంచి అయోధ్య శివారులోని సురక్షిత ప్రాంతంలో దాదాపు 1,200 కోతులకు నిత్యం పౌష్ఠికాహారం అందిస్తున్నాడు.

అయోధ్యలో ఆహారం కోసం కోతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసినప్పుడు తనకు బాధగా అనిపించిందని, వాటి కోసం తన వంతు కృషి చేయాలనుకుంటున్నానని అక్షయ్ కుమార్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీపావళి సందర్భంగా తన తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ వారి పేరిట వానరసేనకు ఆహారం అందించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. దీనిని చూసి తన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సంతోషిస్తారన్నాడు.
Akshay Kumar
Telangana
Diwali

More Telugu News