Nara Lokesh: మరి కాసేపట్లో లాస్ వెగాస్ నగరంలో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్... హాజరుకానున్న ఏపీ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh will attend IT Serve Synergy Summit in Las Vegas
  • అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు
  • అత్యంత ముఖ్యమైన ఐటీ సమ్మిట్ లో కీలక ఉపనాస్యం చేయనున్న లోకేశ్
ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించిన నారా లోకేశ్... ఇవాళ అతి ముఖ్యమైన ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ కీలక సదస్సు మరికాసేపట్లో లాస్ వెగాస్ నగరంలో ప్రారంభం కానుంది.

ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో నారా లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ  రేచల్, పెప్సికో మాజీ సిఇఓ ఇంద్రానూయి, రెవేచర్ సీఈవో అశ్విన్ భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షియాలతో లోకేశ్ సమావేశం కానున్నారు. 

ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, నేటి ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్ లో... రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలపై నారా లోకేశ్ పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు. అంతేకాకుండా, ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో విశిష్ట అతిథిగా నారా లోకేశ్ కీలకోపన్యాసం చేయనున్నారు.
Nara Lokesh
IT Serve Synergy Summit
Las Vegas
USA
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News