Komatireddy Venkat Reddy: ఏం చేసినా ప్రతిపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy takes on BRS leaders

  • బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తోందన్న మంత్రి
  • ఇబ్బంది ఉన్నా... మేనిఫెస్టోలో ప్రకటించని హామీలూ అమలు చేస్తున్నామన్న మంత్రి
  • కులగణన చేపట్టాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్న మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారని... అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ప్రకటించని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ నేతలు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వెనుకబడిన కులాలపై బీఆర్ఎస్‌కు ఏమాత్రం ప్రేమ లేదని మండిపడ్డారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బలహీన వర్గాలకు చెందిన నాయకుడే ఉన్నాడని వెల్లడించారు.

  • Loading...

More Telugu News