Chandrababu: చంద్రబాబును కలిసిన యోగా గురువు బాబా రామ్‌దేవ్

Baba Ramdev meets AP CM Chandrababu
  • అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
  • ఏపీలో వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుపై చర్చ
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు సీఎం వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. అమరావతిలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఏపీలో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది.

బాబా రామ్‌దేవ్‌తో భేటీకి సంబంధించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుతో పాటు వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, విద్యా రంగాల్లో పెట్టుబడులపై చర్చించినట్లు పేర్కొన్నారు. 
Chandrababu
Baba Ramdev
Andhra Pradesh
Amaravati

More Telugu News