Naga Chaitanya: నాగ చైతన్య - శోభిత వివాహ ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

naga chaitanya sobhita dhulipala marriage date fixed
  • నాగచైతన్య - శోభిత వివాహ ముహూర్తంపై సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రచారం
  • డిసెంబర్ 4న నాగచైతన్య - శోభిత వివాహం 
  • ధ్రువీకరించిన అక్కినేని కుటుంబ సభ్యులు
నటుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 4న వీరు ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు వివాహ ముహూర్తం ఖరారు అయిన విషయాన్ని ధ్రువీకరించారు. నాగచైతన్య - శోభితల నిశ్చితార్ధ వేడుక ఈ ఏడాది ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే నాడు వివాహ తేదీ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నాగచైతన్య - శోభిత వివాహం ఎప్పుడా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వివాహ ముహూర్తం ఖరారు అయినట్లుగా వార్తలు వచ్చాయి. 

నాగచైతన్య - శోభితల వివాహం డిసెంబర్ నెలలో ఉంటుందంటూ బుధవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, అధికారికంగా ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితం శోభిత తన ఇన్‌స్టా వేదికగా 'గోధుమ రాయి పసుపు దంచటం .. ఇక ఆరంభమైంది' అంటూ పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు పరోక్షంగా ప్రకటించి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారికంగా చెప్పకపోయినా త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా భావించారు. అభిమానులు అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్‌లో వివాహ ముహూర్తం ఖరారు అయ్యింది. 
Naga Chaitanya
Sobhita Dhulipala
naga chaitanya sobhita dhulipala marriage
Movie News

More Telugu News