Chandrababu: వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పరిశీలన .. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన పవన్

yellapragada subbarao name should be considered

  • పవన్ కల్యాణ్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు
  • ప్రతిపాదన పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు చంద్రబాబు ఆదేశాలు జారీ 
  • సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి వివరాలు అందించారు. 

ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త  డా. ఎల్లాప్రగడ సబ్బారావు స్వస్థలం భీమవరం అని, ఆయన చదువుకున్నది రాజమహేంద్రవరం కావున కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏదైనా ఒకదానికి ఆయన పేరుపెడితే సముచితంగా ఉంటుందని పవన్ కల్యాణ్ కోరారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు.  

తన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, పరిశీలించాలని ఆదేశించినందున ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘అరియోమైసిన్’ ను ఆయన కనుగొనడమే కాక బోద, క్షయ వ్యాధి కట్టడికి మందులను రూపొందించారని, క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీకి వాడే తొలితరం మందులను ఆయన అభివృద్ధి చేశారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News