Pawan Kalyan: పాక్‌, బంగ్లాలోని హిందువుల భద్రత కోసం ప్రార్థించండి.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆసక్తికర ట్వీట్!

Pawan Kalyan greets Hindus of Pakistan Bangladesh Afghanistan on Diwali
  • పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లలోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన్ ప‌వ‌న్‌
  • బంగ్లాలో ఇటీవ‌ల‌ జరుగుతున్న పరిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ అక్కడ హిందువులకు దేవుడు ధైర్యం ఇవ్వాల‌ని ప్రార్థించిన జ‌న‌సేనాని
  • సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట తాలూకు వీడియోను ట్వీట్‌కు జోడించిన ప‌వ‌న్‌
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ దీపావళి పండుగ‌ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని హిందువులకు ఆయ‌న‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

"పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని హిందువులకు నా హృదయపూర్వక 'దీపావళి' శుభాకాంక్షలు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లోని హిందువులకు, మీరు ఉన్న పరిస్థితిలో శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. 'భారత్'లో మేమంతా మీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాం. ఇవాళ‌ దీపావళి రోజున బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ రెండింటిలోనూ హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం. వారి నేల‌లలో ధర్మం పునరుద్ధరించబడాలని కోరుకుందాం" అని పవన్ ట్వీట్ చేశారు.

అలాగే సింధి భాషలో ఓ బాలుడు పాడుతున్న పాట తాలూకు వీడియోను జ‌న‌సేనాని ఈ ట్వీట్‌కు జోడించారు. భారత్‌ నుంచి విడిపోయామన్న బాధను చెబుతూ ఆ బాలుడు పాడిన పాటను పవన్ రీషేర్ చేశారు. పాకిస్థాన్‌లో ఉంటున్న  హిందువులు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ పెయిన్‌ ఈ బాలుడి పాటలో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. 
Pawan Kalyan
Pakistan
Bangladesh
Sunny Hindustani
Diwali
Andhra Pradesh

More Telugu News