Ramcharan: 'ఆర్‌సీ 16' మేకర్స్‌ దీపావళి విషెస్‌

Ramcharan RC16 Makers Shoot Update With Diwali Wishes
  • రాంచరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో 'ఆర్‌సీ 16' ప్రాజెక్టు
  • ఇవాళ దీపావ‌ళి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్
  • త్వరలోనే ఆర్‌సీ 16 ప్రయాణం మొదలవుతుందని ట్వీట్
గ్లోబ‌ల్‌ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన కాంబోలో ఒక మూవీ రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టు పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలో ఇవాళ దీపావ‌ళి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆర్‌సీ 16 మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. 

మీరందరూ జీవితంలో నూతనోత్తేజం, సంకల్పంతో అద్భుతమైన పండుగను జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. త్వరలోనే ఆర్‌సీ 16 ప్రయాణం మొదలవుతుందని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మ‌రోవైపు చెర్రీ ఈ సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన‌ ఈ మూవీ జ‌న‌వ‌రి 10న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. 
Ramcharan
RC16
Diwali
Tollywood

More Telugu News