Smartphone Market in India: విక్రయాల్లో 'వివో'... వాల్యూ పరంగా 'శాంసంగ్' టాప్‌

Smartphone Market in India Samsung widens Value Share

  • సేల్స్‌లో విలువ‌ పరంగా 22.8 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌లో శాంసంగ్ 
  • విక్ర‌యాల‌ పరంగా వివో 19.4 శాతం మార్కెట్‌ వాటాతో అగ్ర‌స్థానం
  • ఈ మేర‌కు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్ సంస్థ నివేదిక

భార‌త‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీ సంస్థ‌ శాంసంగ్ దూసుకెళ్తోంది. స్మార్ట్‌ఫోన్‌ విక్ర‌యాల్లో విలువ‌ పరంగా 22.8 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌లో నిలిచింది. అలాగే యాపిల్‌ రెండో స్థానం ద‌క్కించుకుంది. 

శాంసంగ్‌ మార్కెట్‌ వాటా 2023 వాల్యూ పరంగా 21.8 శాతంగా ఉంటే.. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22.8 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో యాపిల్‌ వాటా 21.8 నుంచి 21.6 శాతానికి పడిపోయింద‌ని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్ సంస్థ నివేదిక పేర్కొంది. ఈ మేర‌కు ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో మూడో క్వార్ట‌ర్‌ గణాంకాలను అది వెలువ‌రించింది.

కాగా, విక్ర‌యాల‌ పరంగా చైనీస్ మొబైల్ త‌యారీదారు వివో 19.4 శాతం మార్కెట్‌ వాటాతో అగ్ర‌స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా షావోమి (16.7 శాతం), శాంసంగ్ (15.8 శాతం), ఒప్పో (13.4 శాతం), రియ‌ల్‌మీ (11.3 శాతం) ఉన్నాయి. మిగిలిన ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలు 23.3 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. 

  • Loading...

More Telugu News