Vijayasai Reddy: చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Criticizes CM Chandrababu Naidu
    
సీఎం చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ సీనియ‌ర్‌ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు చంద్ర‌బాబుకు ఏటీఎంగా మారిందంటూ విమ‌ర్శించారు. 

అధికారంలోకి రావడమే ఆలస్యంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు చంద్ర‌బాబు ద్రోహం చేస్తున్నారని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ఆరోపించారు. 

ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు దుర్బుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Chandrababu
YSRCP
Andhra Pradesh

More Telugu News