Game Changer: 'గేమ్ చేంజర్' నుంచి దీపావళి రోజున స్పెషల్ అప్ డేట్

Game Changer teaser will be out on Nov 9
  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • నవంబరు 9న టీజర్ రిలీజ్
  • డేట్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
  • వచ్చే ఏడాది జనవరి 10న రిలీజవుతున్న చిత్రం 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లో గేమ్ చేంజర్ చిత్రం పట్ల ఆసక్తి అంతకంతకు పెరిగిపోతోంది. సినిమా రిలీజ్ డేట్ (2025 జనవరి 10) అనౌన్స్ చేసినప్పటి నుంచి... ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో నేడు దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం... గేమ్ చేంజర్ నుంచి ఆసక్తికర కబురు అందించింది. నవంబరు 9న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.  వెలిగించేద్దాం అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. 

తాజా అనౌన్స్ మెంట్ తో మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్ మ‌రింత పెరిగింది. టీజ‌ర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ గ‌మ‌నిస్తే రైల్వే ట్రాక్‌పై కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లుంగీ, బ‌నియ‌న్‌తో ప‌క్కా మాస్ లుక్‌లో కూర్చున్న రామ్ చ‌ర‌ణ్‌ను చూడొచ్చు. 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్ ఈ లుక్ ఉన్న పోస్ట‌ర్‌ను పోస్ట్ చేసి గేమ్ చేంజ‌ర్‌లో ట్రైన్ ఫైట్ ఉండ‌బోతుంద‌ని, ఆ ఫైట్ అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ఉంటుంద‌ని చెప్ప‌టంతో అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుకున్నాయి. 

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కతున్న ఈ భారీ చిత్రానికి శంకర్ దర్శకుడు. వాణిజ్య విలువలు మిస్ కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో శంకర్ దిట్ట. ముఖ్యంగా అవినీతి నిర్మూలన శంకర్ సినిమాల్లో మెయిన్ టాపిక్ గా ఉంటుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ చిత్రం కూడా ఆ కోవలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ పాప్యులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్... గేమ్ చేంజర్ తో మరో మెట్టు పైకి ఎక్కడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Game Changer
Teaser
Ram Charan
Shankar
Dil Raju
SVC
Tollywood

More Telugu News