kendriya grihmantri dakshata padak: తెలుగు రాష్ట్రాల పోలీసులకు ‘గృహమంత్రి దక్షతా పదక్’ అవార్డులు

govt names 463 police personnel for kendriya grihmantri dakshata padak

  • పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీసులకు అవార్డులు ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
  • దేశ వ్యాప్తంగా 463 మంది పోలీసులకు అవార్డులు
  • తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఎస్పీలతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు పురస్కారాలు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గానూ 'కేంద్రీయ గృహ మంత్రి దక్షతా పదక్' అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. దర్యాప్తు, ఫొరెన్సిక్ సైన్స్, ప్రత్యేక ఆపరేషన్లు తదితర విభాగాలలో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను అందజేస్తుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా 463 మంది పోలీస్ సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. 
 
వీరిలో ఏపీ, తెలంగాణ సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీబీఐ, సీఆర్పీఎఫ్, ఎన్ఐఏ, ఎన్సీపీ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది ఉన్నారు.  ఏపీ నుంచి ఇద్దరు ఎస్పీలు, తెలంగాణ నుండి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ అవార్డులు లభించాయి. 

  • Loading...

More Telugu News