Merugu Nagarjuna: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

Woman complains against former minister Meruga Nagarjuna
  • వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు
  • మేరుగు నాగార్జున తన నుంచి రూ.90 లక్షలు తీసుకున్నాడన్న మహిళ
  • ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నాడని ఫిర్యాదు
  • డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని వెల్లడి 
వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. 

ఆ మహిళ స్వస్థలం విజయవాడ. ఇవాళ ఆమె తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజును కలిసి మేరుగు నాగార్జునపై ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.
Merugu Nagarjuna
Woman
Complaint
Police
Tadepalli
YSRCP

More Telugu News