Ravindra Jadeja: జహీర్, ఇషాంత్ రికార్డు బ‌ద్ద‌లు.. టాప్ -5లోకి ర‌వీంద్ర జ‌డేజా

Ravindra Jadeja has surpassed Ishant Sharma and Zaheer Khan in the list of India bowlers with most Test wickets
  • టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల జాబితాలో టాప్ -5లోకి జ‌డ్డూ
  • 312 వికెట్ల‌తో ఐదో స్థానంలో కొనసాగుతున్న జ‌డేజా
  • 619 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో అనిల్ కుంబ్లే
భార‌త జ‌ట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా త‌న టెస్టు కెరీర్లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల‌ జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల‌ను వెన‌క్కి నెట్టి టాప్‌-5లోకి దూసుకొచ్చాడు. 

ముంబ‌యిలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జడ్డూ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్ వికెట్ తీయ‌డం ద్వారా జడేజా ఈ రికార్డు సాధించాడు. ప్రస్తుతం జడేజా టెస్టుల్లో 312 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో లెజెండ‌రీ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే 619 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ని త‌ర్వాతి స్థానంలో వ‌రుస‌గా రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434) ఉన్నారు.

టెస్టుల్లో ఆత్యధిక వికెట్లు తీసిన‌ భార‌త బౌల‌ర్లు

1. అనిల్ కుంబ్లే - 619 వికెట్లు
2. రవిచంద్రన్ అశ్విన్ - 533* వికెట్లు
3. కపిల్ దేవ్ - 434 వికెట్లు
4. హర్భజన్ సింగ్ - 417 వికెట్లు
5. రవీంద్ర జడేజా - 312* వికెట్లు


ఇక ముంబ‌యిలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్‌ను భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 ప‌రుగులకు ఆలౌట్ అయింది. ర‌వీంద్ర జ‌డేజా 5 వికెట్లు తీసి కివీస్ బ్యాట‌ర్ల‌ను బెంబెలెత్తించాడు. మ‌రో స్పిన్న‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆకాశ్ దీప్ కు ఓ వికెట్ దక్కింది. ప్ర‌స్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Ravindra Jadeja
Team India
Cricket

More Telugu News