Mahesh Kumar Goud: బీజేపీలో దక్కుతున్న గౌరవం ఏమిటో మహేశ్వర్ రెడ్డి ఆలోచించాలి... కనీసం కుర్చీలేదు: టీపీసీసీ చీఫ్

TPCC chief Mahesh Kumar Goud suggetion to BJP Maheshwar Reddy
  • కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదన్న టీపీసీసీ చీఫ్
  • మోదీ వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేస్తారని ఆగ్రహం
  • అయినా రాహుల్ గాంధీ పాజిటివ్‌గా తీసుకుంటారని వ్యాఖ్య
బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ పార్టీలో దక్కుతున్న గౌరవం ఏమిటో ఆలోచించాలని... బీజేపీ కార్యాలయంలో ఆయనకు కనీసం కుర్చీ కూడా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయనకు పార్టీ కార్యాలయంలో కనీసం స్థానం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ... ఇతర ఏ పార్టీలోనూ లేదన్నారు. బీజేపీలో అంతకంటే లేదని వ్యాఖ్యానించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరని, కానీ తమ పార్టీపై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. విమర్శలను రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్‌గా తీసుకుంటారన్నారు. సీఎం మారుతారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతుందన్నారు.

కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కులగణన విషయంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజలను వంచించారని... అందుకే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. 

తమ సీఎం, మంత్రులు, పార్టీ నేతలు... ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా పని చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 5న జరిగే పీసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే కులగణనపై రాహుల్ గాంధీ వివరాలు తీసుకుంటారని తెలిపారు.
Mahesh Kumar Goud
Congress
Alleti Maheshwar Reddy
BJP

More Telugu News