Life Insurance: అయ్యప్ప భక్తులకు ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్... కేరళ సర్కారు కీలక నిర్ణయం

Kerala govt decided to provide free insurance coverage to Ayyappa devotees
  • అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభం
  • అయ్యప్ప భక్తుడు శబరిమల యాత్రలో మరణిస్తే రూ.5 లక్షలు చెల్లింపు
  • మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే బాధ్యత తీసుకోనున్న ప్రభుత్వం
అయ్యప్ప దీక్షల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక అంశంపై చర్చించారు. 

అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించనున్నారు. అంతేకాదు, ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. 

అయ్యప్ప ఆలయంతో పాటు కేరళలోని దక్షిణ ప్రాంతంలోని అన్ని ఆలయాలను పర్యవేక్షించే ట్రావెన్ కూర్ దేవస్వోమ్ బోర్డు ఈ సరికొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, రెండు నెలలకు పైగా కొనసాగే అయ్యప్ప స్వాముల దీక్షల నేపథ్యంలో... శబరిమల ఆలయం నవంబరు 16న తెరుచుకోనుంది.
Life Insurance
Ayyappa Devotees
Sabarimala
Kerala Govt

More Telugu News