Ravindra Jadeja: డబ్ల్యూటీసీలో రికార్డు నమోదు చేసిన రవీంద్ర జడెజా

Ravindra Jadeja has scalped nine wickets in the third Test match
  • తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన జడెజా
  • ప్రస్తుత డబ్ల్యుటీసీలో 50 వికెట్లు తీసిన జడెజా
  • ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడు జడెజా
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రవీంద్ర జడేజా తొమ్మిది వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో జడెజా 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ)లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ చొప్పున తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే కివీస్ చేతిలో ఒకే వికెట్ ఉంది. రేపు కివీస్‌ను 150 పరుగులకు కట్టడి చేస్తే భారత్ లక్ష్యం తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

వాంఖెడేలో టాప్ 5 చేజింగ్‌లు ఇవే...

వాంఖెడేలో అత్యధిక అత్యధిక ఛేదన రికార్డ్ దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2000 ఫిబ్రవరిలో భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 63 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. 1980లో తమ ముందు భారత్ ఉంచిన 96 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ నష్టపోకుండా చేధించింది.

2012లో భారత్ నిర్దేశించిన 58 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో చేధించింది. 1984లో ఇంగ్లండ్ తమ ముందు ఉంచిన 48 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. 2001 ఫిబ్రవరిలో టీమిండియా తమ ముందు ఉంచిన 47 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో చేధించింది.
Ravindra Jadeja
Sports News
Test Match

More Telugu News