Dharmapuri Arvind: ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: ఎంపీ అర్వింద్

MP Arvind said people are ready to defeat Congress wheneves elections come
  • ప్రజల్లో వ్యతిరేకత ఉందనే స్థానిక ఎన్నికలు నిర్వహించడంలేదన్న అర్వింద్ 
  • వెంటనే తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
  • గత ఎన్నికల ప్రచారంలో హామీలపై ఖర్గే కూడా మాట్లాడారని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందన్న కారణంగానే స్థానిక ఎన్నికలు నిర్వహించడంలేదని అన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. 

గత ఎన్నికల ప్రచారంలో హామీలపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడారని, అధికారంలో ఉండగా ఏంచేశారని పాదయాత్రలు అంటూ మండిపడ్డారు. 

రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇక, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను బెదిరించేలా ఉన్నాయని అన్నారు.
Dharmapuri Arvind
BJP
Local Body Polls
Congress
Telangana

More Telugu News