Team India: టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్... టెస్టు చరిత్రలోనే అద్భుత విజయమన్న మైకేల్ వాన్

Michael Vaughan opines on Team India performance against New Zealand
  • ముగిసిన టీమిండియా-న్యూజిలాండ్ టెస్టు సిరీస్
  • 3-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్
  • టీమిండియాలోనూ స్పిన్ ఆడలేని వాళ్లున్నారన్న మైకేల్ వాన్
న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడం పట్ల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. ఇతర జట్లలాగే స్పిన్ అంటే తడబాటుకు గురయ్యే ఆటగాళ్లు ఇప్పుడు భారత జట్టులోనూ ఉన్నారని ఎద్దేవా చేశాడు. 

టెస్టు చరిత్రలోనే న్యూజిలాండ్ సాధించిన విజయం అద్వితీయం అని అభివర్ణించాడు. భారత్ లో భారత్ ను ఓడించడం ఎప్పుడూ గొప్ప విషయమే అని, పైగా క్లీన్ స్వీప్ చేయడం అంటే అద్భుతం అని పేర్కొన్నాడు. 

ఇవాళ ముంబైలో ముగిసిన మూడో టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. భారత్ ను సొంతగడ్డపై తొలిసారి వైట్ వాష్ చేసిన జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది.
Team India
Michael Waughan
New Zealand
Test Series

More Telugu News