YSRCP: సహానా కుటుంబానికి రూ.10 లక్షల చెక్ అందించిన వైసీపీ

YSRCP stood by Sahanas family with financial assistance of Rs10 lakh
  • కుటుంబ సభ్యులకు చెక్ అందజేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
  • ఇటీవలే బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్
  • ఇవాళ చెక్ అందజేసిన పార్టీ నేతలు
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స‌హానా అనే యువతి గత నెల అక్టోబర్‌లో నవీన్ అనే రౌడీషీట‌ర్ పాశవిక దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన సహానా కుటుంబానికి వైసీపీ నాయకత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. 

గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పార్టీ నేతలు అంబటి మురళి, ఇతర నాయకులు ఇవాళ (ఆదివారం) సుహానా ఇంటికి వెళ్లి పరిహారం చెక్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వైసీపీ వెల్లడించింది. సహానా కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఇటీవలే పరామర్శించారని, పార్టీ తరఫున రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారని పార్టీ ప్రస్తావించింది.

కాగా గత నెలలో సహానా మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో ఆమె మృత‌దేహాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. మృతురాలి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ త‌ర‌ఫున ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రూ.10 ల‌క్ష‌లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 

కాగా సహానాను హత్య చేసిన నిందితుడు న‌వీన్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. స‌హానా-న‌వీన్ మ‌ధ్య అప్పు విష‌యంలో జరిగిన త‌గాదాలే హ‌త్య‌కు దారితీశాయని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.
YSRCP
Ambati Rambabu
YS Jagan
Andhra Pradesh
Guntur District

More Telugu News