Justin Trudeau: కెన‌డాలో ఖలిస్థానీ గ్రూప్ దుశ్చ‌ర్య‌.. ఆలయంలో హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ప్ర‌ధాని ట్రూడో!

Devotees attacked at Canada temple by Khalistanis PM Justin Trudeau Condemns

  • బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌లో ఘ‌ట‌న‌
  • హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి అమానుషం అన్న ట్రూడో
  • దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య‌

కెనడాలో మ‌రోసారి ఖలిస్థానీ మ‌ద్ద‌తుదారులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ వద్ద మహిళలు, పిల్లలు సహా భక్తులపై దాడికి పాల్ప‌డ్డారు. ఆలయం వెలుపల ఉన్న భక్తులపై కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టుకుని దాడి చేశారు. ఈ ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఈ దాడిని కెన‌డా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం తీవ్రంగా ఖండించారు. దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఆదివారం నాడు హిందూ సభా మందిర్‌లోని భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం అమానుషం అన్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రూడో ఈ దాడిని ఖండిస్తూ పోస్ట్ చేశారు. 

"ఈరోజు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌లో జ‌రిగిన‌ హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. ఈ సంఘటనపై త్వ‌ర‌గా స్పందించి బాధితుల‌ను కాపాడినందుకు పీల్ ప్రాంత పోలీసుల‌కు ధ‌న్య‌వాదాలు. అంతేగాకుండా వేగంగా ద‌ర్యాప్తు చేయ‌డం ప్ర‌శంస‌నీయం" అని ట్రూడో త‌న పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆ దేశంలోని ప‌లు హిందూ సంఘాలు కూడా ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించాయి. 

  • Loading...

More Telugu News