Telangana TET: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Telangana TET Notification 2024 Released

  • నోటిఫికేషన్‌ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
  • ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష 
  • టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ, టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది. అందులో భాగంగానే ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి.  

ఇక రెండో టెట్‌కు నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని గతంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈరోజు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. టెట్ పేప‌ర్‌-1కు డీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు కాగా... టెట్ పేప‌ర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. 

ఇక టెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది సార్లు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా.. జ‌న‌వ‌రిలో ప‌దోసారి జ‌ర‌గ‌నుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

కాగా, స్కూల్ అసిస్టెంట్‌గా ప‌దోన్న‌తి పొందాలంటే టెట్ అర్హ‌త ఉండాల‌ని చెబుతుండ‌టంతో ఈసారి వేలాది మంది స‌ర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. 

  • Loading...

More Telugu News