Telangana: 'డెడికేటెడ్ కమిటీ' చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావును నియమించిన తెలంగాణ ప్రభుత్వం
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- రిజర్వేషన్లపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశాలు
తెలంగాణలో కులగణన నేపథ్యంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా చైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం... రిజర్వేషన్లపై నెల రోజుల్లోగా నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ఎల్లుండి నుంచి తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల ప్రాతిపదికన సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా... న్యాయపరమైన చిక్కులు లేకుండా కోర్టు తీర్పులను అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సమీక్షించింది. ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.