Suprime Court: ప్రధాని మోదీ తన నివాసానికి రావడంపై మరోసారి స్పందించిన సీజేఐ చంద్రచూడ్

nothing wrong in pm modis visit to my residence on ganesh puja cji chandrachud
  • విమర్శలపై మరోసారి వివరణ ఇచ్చిన సీజేఐ డీవీ చంద్రచూడ్
  • తన నివాసానికి ప్రధాని మోదీ రావడంలో తప్పులేదని పేర్కొన్న చంద్రచూడ్
  • అది బహిరంగ భేటీయే కానీ వ్యక్తిగత సమావేశం కాదని స్పష్టీకరణ 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరు కావడంపై తీవ్ర రాజకీయ దుమారం రేగిన విషయం విదితమే. సీజేఐ నివాసంలో జరిగిన గణేశ్ పూజకు ప్రధాని మోదీ హాజరుకావడంపై ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ఆక్షేపిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో వారి మధ్య భేటీ వివాదాస్పదం అయింది. ఈ వివాదంపై మరి కొన్ని రోజుల్లో పదవీ విరమణ అవుతున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మరోసారి స్పందించారు. 

ఇంతకు ముందు లోక్‌సత్తా వార్షిక ఉపన్యాసంలో ఆయన దానిపై క్లారిటీ ఇచ్చారు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు కలుస్తుంటారని, అలానే ప్రధాన మంత్రులు, సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తులు కలుస్తుంటారని, అయితే ఆ భేటీల్లో న్యాయపరమైన విషయాలు ఏవీ చర్చించబోమని వెల్లడించారు. తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తాను ముఖ్యమంత్రితో, ముఖ్యమంత్రి తనతో సమావేశం అవ్వడం జరిగిందని చెబుతూ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు కావడం ఒక ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. 

తాజాగా ఈ వివాదంపై మరోసారి సీజేఐ స్పందించారు. 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీజేఐ చంద్రచూడ్ వివిధ అంశాలపై మాట్లాడుతూ, ప్రధాని మోదీ తమ నివాసానికి రావడంపైనా వివరణ ఇచ్చారు. తన నివాసానికి ప్రధానమంత్రి రావడంలో తప్పులేదని స్పష్టం చేశారు. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదని పేర్కొన్నారు. 
Suprime Court
DY Chandrachud
PM Modi
PM Meets CJI

More Telugu News