Gold Price: పసిడి ధర ఇంకాస్త తగ్గింది... వివరాలు ఇవిగో!

gold drops rs 1300 to rs 81100 per 10 gm silver also

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
  • పది గ్రాముల బంగారం ధర రూ.1300ల మేర తగ్గి రూ.81వేలకు చేరింది
  • వెండి కిలో ధరకు రూ.4,600లు తగ్గి రూ.94,900లు చేరింది

సాధారణంగా బంగారం, వెండి ధరలు సీజన్‌లో పెరుగుతూ అన్ సీజన్‌లో తగ్గుతూ ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా జరిగే రాజకీయ, వ్యాపారాల పరిణామాలు కూడా బంగారం ధరల హెచ్చు తగ్గులకు కారణంగా అవుతుంటాయి. ఇటీవల పండుగలు, వివాహ శుభ కార్యక్రమాల నేపథ్యంలో పెరిగిన బంగారం, వెండి ధరలు కొద్ది మేర తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం పది గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.82,400 ల మేర పలికింది. అయితే, సోమవారం నాటికి రూ.1300ల మేర తగ్గి రూ.81వేలకు చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఆలానే ఇటీవల వెండి కిలో ధర లక్ష రూపాయల మార్క్ దాటింది. బంగారం ధర తగ్గినట్లుగానే వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది.  సోమవారం కిలోకు రూ.4,600లు తగ్గింది. ధిల్లీలో సోమవారం వెండి కిలో ధర రూ.94,900లకు చేరింది. 

బంగారం వెండి ధరల తగ్గుదలపై అనలిస్టులు పలు కారణాలను వెల్లడిస్తున్నారు. ప్రధానంగా బంగారం వర్తకులు, రిటైలర్ల నుండి ఆశించిన మేర డిమాండ్ లేకపోవడం ధరలు తగ్గుముఖం పట్టణానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. నేడు జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 7న ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటన, చైనా ఈ వారంలో ప్రకటించే ఉద్దీపన ప్యాకేజీ తదితర అంశాలు కూడా అంతర్జాతీయంగా బంగరం ధరలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు.   
 

  • Loading...

More Telugu News