Samantha: బరువు పెరగాలంటూ అభిమాని సూచన.. సమంత జవాబు ఇదే..!

Samantha Ruth Prabhu Slams Trolls Asking Her To Gain Weight
  • 2024 లో ఉన్నామని గుర్తుచేసిన హీరోయిన్
  • ఇతరులపై తీర్పులు చెప్పడం మానేయాలని హితవు
  • తన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారం తీసుకుంటున్నట్లు వెల్లడి
ప్రముఖ హీరోయిన్ సమంత దీపావళి పండుగను రాజస్థాన్ లో జరుపుకున్న విషయం తెలిసిందే. రణతంబోర్ జాతీయ పార్కులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలలో సమంత చాలా బలహీనంగా కనిపిస్తున్నారని, కాస్త బరువు పెరగాలని ఓ అభిమాని కోరారు. ఈమేరకు సోమవారం సమంత ఇన్ స్టాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ లో సదరు అభిమాని ఈ కామెంట్ చేశారు. ‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టారు. దీనిపై సమంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

తన బరువు గురించి మరో కామెంట్ అంటూ సమంత నిట్టూర్చారు. ‘నేను మయోసైటిస్ తో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలుసో లేదో కానీ వైద్యుల సూచనల ప్రకారం డైట్ మెయింటైన్ చేస్తున్నా. దీనివల్ల బరువు పెరగడం సాధ్యం కాదు. బరువు విషయంలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా. దయచేసి ఇతరులలో తప్పొప్పులు చూడడం ఇప్పటికైనా మానేయండి. మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తించండి. లివ్ అండ్ లెట్ లివ్..’ అంటూ సమంత జవాబిచ్చారు.
Samantha
Instagram
Samantha Weight
Ranaathambore
Rajasthan
Entertainment

More Telugu News