Thandel: నాగచైతన్య 'తండేల్‌' రిలీజ్‌ డేట్‌ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్‌

Naga Chaitanyas Tandel release date officially confirmed
  • ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తండేల్‌ 
  • ఇంకా 22 రోజుల చిత్రీకరణ బ్యాలెన్స్‌ ఉందన్న నిర్మాత 
  • 100 కోట్ల క్లబ్‌లో తండేల్‌ చేరుతుందన్న నిర్మాత 
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌'. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బన్నీ వాస్‌ మాట్లాడుతూ '' మొదట్లో ఈ చిత్రాన్ని డిసెంబరు 20న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే ఈ సినిమా కోసం చాలా కాంప్లికేటెడ్‌ సిట్యుయేషన్స్‌ వున్నాయి. ఇంకా 22 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్‌తో పాటు షూటింగ్ కోసం చాలా పర్మిషన్స్‌ తీసుకోవాలి. అవి చాలా కష్టతరమైన పర్మిషన్స్‌. దీంతో పాటు సీజీ టీమ్‌కు టైమ్‌ ఇవ్వాలి. 

అయితే అంతా సిద్ధం చేసి ఫిబ్రవరి 7న అక్కినేని అభిమానులకు ఓ క్వాలిటీ సినిమా ఇస్తాను అనే మాట మాత్రం ఇవ్వగలను. ఈ సినిమాను 100 కోట్ల క్లబ్‌లో జాయిన్‌ చేయడానికి మా శాయశక్తులా కష్టపడుతున్నాం. ఫిబ్రవరి 7న అక్కినేని అభిమానులు కాలర్‌ ఎత్తుకునే సినిమా ఇస్తున్నాం. ఈ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్‌గా ఉండటం మాకు చాలా ఆనందంగా వుంది. సిల్వర్‌ స్క్రీన్‌ను గోల్టెన్‌ స్క్రీన్‌గా మార్చే సత్తా ఆమెకు వుంది. 

ఆమెను ఇప్పుడు అందరూ క్వీన్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ అంటున్నారు. నాగచైతన్య క్రేజ్‌కు తోడు సాయి పల్లవి లాంటి మహాలక్ష్మీ మాకు ఉండటం సంతోషంగా వుంది' అన్నారు. ఈ సినిమా విషయంలో కరెక్ట్‌ డేట్‌ లో వస్తున్నాననే ఆనందంలో వున్నానని నాగచైతన్య తెలిపారు. 
Thandel
Naga Chaitanya
Sai Pallavi
Allu Aravind
Bunny Vas
Thandel release date
Chandoo mondeti

More Telugu News