US Elections Results: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు.. ట్రంప్ ఖాతాలో 3 రాష్ట్రాలు.. క‌మ‌ల‌కు ఒక‌టి

US Elections Results Donald Trump Wins Kentucky Kamala Harris Wins Vermont
  • వెర్మాంట్, వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా రాష్ట్రాల ఫ‌లితాలు వెల్ల‌డి
  • వెర్మాంట్‌లో క‌మ‌లా హ్యారిస్ విజ‌యం 
  • వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా రాష్ట్రాల్లో ట్రంప్‌ జ‌య‌కేత‌నం
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాలు షురూ అయ్యాయి. ఒక‌వైపు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పోలింగ్ జ‌రుగుతుండ‌గానే.. నాలుగు రాష్ట్రాల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. వెర్మాంట్, వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా రాష్ట్రాల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. 

ఇందులో వెర్మాంట్‌లో క‌మ‌లా హ్యారిస్ విజ‌యం సాధించారు. దీంతో ఆమె ఖాతాలోకి మూడు ఎల‌క్టోర‌ల్ ఓట్లు చేరాయి. మ‌రోవైపు వెస్ట్ వ‌ర్జీనియా, కెంట‌కీ, ఇండియానా రాష్ట్రాల్లో మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జ‌య‌కేత‌నం ఎగ‌రవేశారు. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లోని 23 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఆయ‌న ఖాతాలోకి వెళ్లాయి.
US Elections Results
Donald Trump
Kamala Harris
US Presidential Polls
USA

More Telugu News