Sundar Pichai: అమెరికా ఎన్నికలు: తమ ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక సూచనలు

sundar pichai sends a stark memo to google employees ahead of us result day
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు
  • ఎన్నికల వేళ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు కీలక సూచనలు చేస్తూ మెయిల్ 
  • ఎన్నికల్లో ఎవరు గెలిచినా అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ ఉండాలని పేర్కొన్న సుందర్ పిచాయ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న తరుణంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమ సంస్థ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. అమెరికా అధ్యక్ష బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య పోటీ నువ్వానేనా అన్నరీతిలో ఉంది. ఇద్దరి మధ్య మెజార్టీ స్వల్పంగానే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో తుది ఫలితంపై తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

అయితే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ ఉండాలని సుందర్ పిచాయ్ తన మెయిల్ ద్వారా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో గూగుల్ సీఈవో వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
కాగా, గూగుల్ పై గతంలో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా ఎన్నికైతే సెర్చ్ ఇంజన్ ‌పై విచారణ చేస్తామని కొంత కాలం క్రితం ట్రంప్ హెచ్చరించారు.  
Sundar Pichai
US Presidential Polls
Donald Trump
Kamala Harris

More Telugu News