AP DSC: ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా

ap dsc notification announcement postponed
  • నేడు విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్
  • ఈ నెల 4న విడుదలైన ఏపీ టెట్ ఫలితాలు
  • డీఎస్సీ ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ
ఏపీలో మెగా డీఎస్పీ ప్రకటన వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే పలు అనివార్య కారణాలతో అధికారులు వాయిదా వేశారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏపీ టెట్ ఫలితాల తర్వాత రెండు రోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని ముందుగా పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ సోమవారం ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేశారు. దీంతో ఈరోజు (బుధవారం,6వ తేదీ) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. 
AP DSC
DSC Notification
postponed

More Telugu News