US Presidential Polls: గెలుపు దిశగా ట్రంప్.. మస్క్ రియాక్షన్ ఇదే!

Elon Musk Reaction As Donald Trump Takes Big Lead
  • ఈ ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతు పలికిన టెస్లా చీఫ్
  • భారీ మొత్తంలో నిధులు సమకూర్చిన వైనం
  • ఫలితాల వేళ ‘గేమ్, సెట్ అండ్ మ్యాచ్’ అంటూ ట్వీట్
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు దిశగా సాగుతుండడంపై టెస్లా చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. టెన్నిస్ మ్యాచ్ లో ఉపయోగించే భాషలో ట్రంప్ గెలుపు, ప్రత్యర్థి ఓటమి ఖాయమైందనే అర్థంలో ట్వీట్ చేశారు. ‘గేమ్, సెట్ అండ్ మ్యాచ్’ అంటూ బుధవారం ఉదయం మస్క్ ట్వీట్ చేశారు. సాధారణంగా టెన్నిస్ మ్యాచ్ లో ఓ ఆటగాడు గెలిచాడు అనేది చెప్పడానికి సోషల్ మీడియాలో ఈ పదాలు ఉపయోగిస్తుంటారు.

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ట్రంప్ కోసం మస్క్ ప్రచారం కూడా చేశారు. ట్రంప్ గెలవకుంటే అమెరికాలో ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్ సమకూర్చారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి, రిపబ్లికన్ పార్టీవైపు ఆకర్షించడానికి పలు లాటరీ స్కీములు పెట్టి పరోక్షంగా ట్రంప్ కు ప్రచారం చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్ ను ట్రంప్ ఆకాశానికి ఎత్తేశారు. మస్క్ గొప్ప బిజినెస్ మ్యాన్ అని, ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడంలో మస్క్ మేటి అని కొనియాడారు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మస్క్ కు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెడతానని ట్రంప్ పేర్కొన్నారు.
US Presidential Polls
Elon Musk
Donald Trump
Twitter
Republicans

More Telugu News