IPL Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. రిషభ్‌పంత్ కనీస ధర ఎంతో తెలుసా?
- ఈ నెల 24, 25న జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం
- రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌లో పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సహా 23 మంది
- వేలంలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు
ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌పంత్‌కు ఎంత ధర పలుకుతుందన్న దానిపై ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. వేలం కోసం మొత్తం 1165 మంది ఇండియన్ ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 23 మంది అత్యధక ధర అయిన రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత సీజన్లో ఆయా జట్లకు సారథ్యం వహించిన రిషభ్‌పంత్, కేఎల్ రాహుల్, 2024 టైటిల్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే బేస్ ప్రైస్‌లో ఉన్నాడు.
రూ.2 కోట్ల బైస్ ప్రైస్‌లో ఉన్నది వీరే..
వీరితోపాటు ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, అవేశ్‌ఖాన్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి.నటరాజన్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్షదీప్‌సింగ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, దేవదత్ పడిక్కల్, రిషభ్‌పంత్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ.
చివరి నిమిషంలో మారిన వేదిక
సౌదీ అరేబియా పోర్ట్ సిటీ జెడ్డాలో ఈ నెల 24, 25న ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. నిజానికి రియాద్‌లో వేలం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వేదిక జెడ్డాలోని అబాదీ అల్ జోహార్ ఎరీనా (బెంచ్ మార్క్ ఎరీనా)కు మారింది. బీసీసీఐ నిన్ననే వేదికతోపాటు వేలంలో పాల్గొననున్న ఆటగాళ్లను ప్రకటించింది. 1574 మంది ఆటగాళ్లలో 320 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా, 1224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, 30 మంది ఆటగాళ్లు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నట్టు పేర్కొంది.