AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ... కీలక అంశాలకు ఆమోదం!
- ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం
- పిఠాపురం హెడ్ క్వార్టర్ గా పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ
- జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు:
- ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం.
- ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం.
- ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఆర్డినెన్స్ కు ఆమోదం.
- కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్ గా నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడానికి ఆమోదం.
- పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని పిఠాపురం హెడ్ క్వార్టర్ గా ఏర్పాటుకు అంగీకారం.
- గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో 2014 నుంచి 2019 సంవత్సరాల మధ్య పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించేందుకు ఆమోదం.
- జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 61కి పెంచేందుకు ఆమోదం.
- పల్నాడు జిల్లాలోని ఆరు మండలాలు, 92 గ్రామాలు... సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం... బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను సీఆర్డీయే పరిధిలోకి తీసుకురావడానికి ఆమోదం.
- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు పంపేలా నిర్ణయం.