Donald Trump: నా పార్టీ పేరూ అదే... అందుకే ట్రంప్ గెలుపు సంతోషాన్ని ఇచ్చింది: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్య

Donald Trump Is From Republican Party And My Party Name
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
  • ట్రంప్ పార్టీ పేరు రిపబ్లికన్... నా పార్టీ పేరూ అదేనన్న రాందాస్ అథవాలే
  • ట్రంప్‌కు వ్యాపారవేత్త గౌతమ్ అదానీ శుభాకాంక్షలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. విస్కాన్సిన్‌లో గెలుపుతో మేజిక్ ఫిగర్ దాటిన ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లతో గెలుపొందారు. మరో మూడు రాష్ట్రాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన ఇంకో 30కి పైగా ఎలక్టోరల్ ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రంప్ గెలుపు నేపథ్యంలో వివిధ దేశాధినేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  భారత కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అని... భారత్‌లో తమ పార్టీ పేరు కూడా రిపబ్లికన్ పార్టీయేనని... కాబట్టి చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చాలా పెద్ద నాయకుడని, అతను అమెరికాలో విజయం సాధించాడన్నారు. అతను భారతీయులందరి ఓటును గెలుచుకున్నారని పేర్కొన్నారు.

ట్రంప్‌కు అదానీ అభినందనలు

దృఢ సంకల్పం కలిగిన నేత, తిరుగులేని నాయకుడు, ధైర్యానికి ప్రతిరూపం... ఇవన్నీ ఉన్నవారు భూమిపై ఎవరైనా ఉన్నారా అంటే అది ట్రంప్ అని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు అభినందనలు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Donald Trump
Ramdas Athawale
BJP
USA
US Presidential Polls

More Telugu News