RGV: బుల్లెట్ ట్రంప్‌కు తగిల్తే.. కమల చనిపోయింది.. అమెరికా ఫలితాలపై రాంగోపాల్‌వర్మ సెటైర్

Bullet hits Donald Trump and died Kamala Harris says RGV
  • పెన్సిల్వేనియాలో ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం
  • కుడి చెవిని తాకుతూ దూసుకెళ్లిన బుల్లెట్
  • ఈ ఘటనను ప్రస్తావిస్తూ ఆర్జీవీ ట్వీట్
వర్తమాన రాజకీయాలు, ఘటనలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సెటైరికల్‌గా స్పందించారు. ‘బుల్లెట్ ట్రంప్‌కు తగిల్తే కమల మరణించింది’ అని ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జులైలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ప్రసంగిస్తుండగా మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనను ఉద్దేశించే ఆర్జీవీ ఇలా ట్వీట్ చేశారు.

కాగా, హోరాహోరీగా జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ 292 ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించి అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చిన కమల 224 ఎక్టోరల్ ఓట్లకే పరిమితమయ్యారు. ఫలితాలను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ ఈసారి ట్రంప్‌కే జై కొట్టడంతో ఆయన గెలుపు నల్లేరుమీద నడకలా మారింది. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
RGV
Donald Trump
Kamala Harris
US Presidential Polls

More Telugu News