HYDRA: సిటీలో మరో 50 మందికి హైడ్రా నోటీసులు

Hydraa Officials Issues Notice To 50 People

  • ప్రభుత్వ స్థలాల కబ్జాపై సీరియస్
  • 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని వార్నింగ్
  • ఆ తర్వాత కూల్చివేతలు చేపడతామని వెల్లడి

ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్ పార్కులతో పాటు లే అవుట్ లలో పార్కుల కోసం వదిలిన స్థలాలను ఆక్రమించడంపై హైడ్రా సీరియస్ గా స్పందించింది. తాజాగా మరో 50 మందికి నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లోగా ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. లేదంటే కూల్చివేతలు చేపడతామని నోటీసుల్లో హెచ్చరించింది. వారం కిందట నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో మన్సూరాబాద్ లో రోడ్డును ఆక్రమించి కట్టిన ఇంటిలో ఓ రూమ్ ను అధికారులు కూల్చివేశారు. ఈ నెలాఖరకు మరికొన్ని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమవుతున్నట్లు సమాచారం.

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించి ఫుల్ టాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్ల బౌండరీలను నిర్ధారించే పనిలో హైడ్రా అధికారులు తలమునకలుగా ఉన్నారు. అదే సమయంలో ఆక్రమణదారులపైనా దృష్టి సారించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల నుంచి కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వారం రోజులుగా కబ్జాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రోడ్ల పక్క ప్రభుత్వ స్థలాలు, ఫుట్ పాత్ లు, పార్కు స్థలాలను ఆక్రమించిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.

  • Loading...

More Telugu News