Elon Musk: ట్రంప్ గెలుపు ఎఫెక్ట్... రూ.2 లక్షల కోట్లు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

Trump Victory Boosts Musk Wealth by rs 2 Lakh Crore
  • ట్రంప్ గెలుపుతో భారీగా లాభపడిన మస్క్ కంపెనీల షేర్లు
  • 290 బిలియన్ డాలర్లకు చేరుకున్న మస్క్ నికర సంపద
  • జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్ సంపద కూడా జంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కంపెనీల స్టాక్స్‌పై మంచి ప్రభావం చూపింది. ట్రంప్ గెలుపు నేపథ్యంలో మస్క్ షేర్లు భారీగా పెరిగాయి. దీంతో ఆయన సంపద 26.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది మన కరెన్సీలో రూ.2 లక్షల కోట్లు. దీంతో ఆయన నికర సంపద 290 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద కూడా 7.14 బిలియన్ డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో దాదాపు రూ.60 వేల కోట్లు. దీంతో బెజోస్ సంపద 228 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన లారీ ఎలిసన్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నికర సంపద కూడా పెరిగింది. ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి.
Elon Musk
Donald Trump
US Presidential Polls
USA

More Telugu News