Bengaluru: బెంగళూరుకు వెళ్లిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు

HYDRA Commissioner Ranganath reaches Bengaluru

  • బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై అధ్యయనం
  • రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనున్న హైడ్రా అధికారులు
  • పలు చెరువులను పరిశీలించనున్న రంగనాథ్, ఇతర అధికారులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోని చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై హైడ్రా అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం హైడ్రా అధికారులు నిన్ననే కర్ణాటక రాజధానికి చేరుకున్నారు. ఈరోజు రంగనాథ్ బెంగళూరుకు చేరుకున్నారు. చెరువుల పరిరక్షణ, విపత్తు నిర్వహణపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచరల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శిస్తారు. అక్కడ సీనియర్ శాస్త్రవేత్తలతో విపత్తు నిర్వహణపై సమావేశమవుతారు. ఆ తర్వాత సెన్సార్ సహాయంతో పర్యవేక్షిస్తున్న మురుగునీటి వ్యవస్థను పరిశీలించనున్నారు. బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు.

లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్‌తో రేపు రంగనాథ్ సమావేశమవుతారు. కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం-2014పై చర్చించనున్నారు. అనంతరం ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని మార్గందోన్హల్లీ చెరువు, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన చెరువులను సందర్శించనున్నారు.

హైదరాబాద్‌లోని ఐదు చెరువులను పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై బెంగళూరులో అధ్యయనం చేయనున్నారు. రెండు రోజుల పాటు బెంగళూరులో అధ్యయనం చేయనున్న హైడ్రా... ఆ తర్వాత హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై ముందుకు సాగనుంది.

  • Loading...

More Telugu News