Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

Sensex sheds 849 points ahead of key US Fed meet

  • 836 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే...
  • అన్ని రంగాల్లోనూ వెల్లువెత్తిన అమ్మకాలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నాడు భారీ నష్టాల్లో ముగిసింది. సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా మిగతా అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద ముగియగా... నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి 24,199 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ బ్యాంకు 400 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 247 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 143 పాయింట్లు నష్టపోయాయి.

నిఫ్టీ, మెటల్ రంగాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు కనిపించాయి. ఆటో, ఫార్మా, రియాల్టీ, ఇంధనం, ఇన్‌ఫ్రా రంగాలు 1 శాతానికి పైగా పడిపోయాయి.

ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, ప్రైవేటు బ్యాంకులు, కమోడిటీ, పీఎస్ఈ, హెల్త్ కేర్ రంగాలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్-30 ప్యాక్‌లో టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, టైటాన్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా నిలిచాయి. ఎస్బీఐ మాత్రం టాప్ గెయినర్‌గా ఉంది.

బీఎస్ఈలో 1,825 స్టాక్స్ లాభాల్లో ముగియగా... 2,129 స్టాక్స్ నష్టాల్లో ముగియగా, 99 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిన్న ట్రంప్ గెలుపుతో ఉత్సాహంగా దూసుకెళ్లిన మార్కెట్ సూచీలు ఈరోజు మాత్రం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు ప్రకటన ఈరోజే ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ క్షీణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

  • Loading...

More Telugu News