ED: అగ్రిగోల్డ్ కేసు... అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ
- అగ్రిగోల్డ్ ఫాంఎస్టేట్స్ సహా 11 కంపెనీలపై ఛార్జీషీట్
- ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
- అగ్రిగోల్డ్ అంశంలో తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు
అగ్రిగోల్డ్ కేసులో ఈడీ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఈడీ... మనీలాండరింగ్ చట్టం కింద గతంలో కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తోంది. ఈ అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో కేసులు నమోదయ్యాయి. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లను వసూలు చేసినట్లు దర్యాఫ్తులో ఈడీ గుర్తించింది. దీంతో అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసింది. 130 షెల్ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు గుర్తించింది. అగ్రిగోల్డ్ డబ్బులను ఎండీ వెంకటరామారావు ఇతర ఖాతాలకు మళ్లించాడని, మళ్లించిన నిధులతో పవర్, రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టాడని వెల్లడైంది.