Nadendla Manohar: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు చోట్ల రైస్ మిల్లుల తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల

Minister Nadendla inspects seven rice mills in Guntur and Palnadu districts

  • ఓ మిల్లు వద్ద రేషన్ సప్లై వాహనం దాచి ఉంచిన వైనం
  • వాహనాన్ని గుర్తించిన మంత్రి నాదెండ్ల
  • మరో మిల్లులో 100 టన్నుల రేషన్ బియ్యం ఉండడం పట్ల విస్మయం

ఏపీ పౌరసరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు రైస్ మిల్లుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్ల గ్రామంలో మూడు రైస్ మిల్లులను తనిఖీ చేశారు. 

శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్లును తనిఖీ చేసిన నాదెండ్ల మనోహర్... రైస్ మిల్లు ప్రాంతంలో  రేషన్ సప్లై చేసే వాహనాన్ని  దాచి ఉంచిన వైనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని సీజ్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. 

ఇక మంత్రి రాకను పసిగట్టిన వెంకటేశ్వర రైస్ మిల్ నిర్వాహకులు, మిల్లు  ప్రాంగణంలో సీఎంఆర్ రైస్ బ్యాక్ ట్యాగ్ లను దహనం చేశారు. రైస్ బాగ్ ట్యాగ్ ల దహనంపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని... పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

అనంతరం విఘ్నేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ టార్చ్ లైట్ వెలుగులో రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. 

ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న రామలింగేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేసిన నాదెండ్ల మనోహర్... రైస్ మిల్లులో  వందలకొద్దీ రైస్ బ్యాగుల్లో ప్రభుత్వం పంపిణీ చేసే చౌక ధరల బియ్యాన్ని గుర్తించారు. రైస్ మిల్లులో దాదాపు 100 టన్నుల పీడీఎస్ రేషన్ ఉండడం పట్ల మంత్రి విస్మయానికి గురయ్యారు. 

రైసు మిల్లులో పీఎడీఎస్ రైస్ ను ఎందుకు గుర్తించలేదని స్థానిక ఎమ్మార్వో చక్రవర్తిని ప్రశ్నించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెట్రాలజీ, సివిల్ సప్లై  డిపార్ట్ మెంట్ అధికారులు రైస్ మిల్లులోని ప్రతి బ్యాగ్ ని పరిశీలించాలని... పంచనామా చేసి... క్రిమినల్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని... రైస్ మిల్లును సీజ్ చేయాలని ఆదేశించిన ఆదేశించారు. 

సత్తెనపల్లి టౌన్ లో సీతారామాంజనేయ సాయి మరియు గణేష్ రైస్ మిల్ ఫ్లోర్ మిల్, శ్రీదేవి ట్రేడర్స్ మరియు రావు రైస్ మిల్ ఫ్లోర్ మిల్, సత్తెనపల్లి మండలం  కోమరపుడి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లును కూడా మంత్రి తనిఖీ చేశారు. 

సాధారణ పౌరుడిలా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్

ఈ పర్యటన సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సాధారణ పౌరుడిలా రోడ్ సైడ్ బంకులో టీ తాగారు. సత్తెనపల్లిలో రోడ్డు పక్కన కారు ఆపించి, బడ్డీ కొట్టు వద్ద టీ తాగి కాసేపు సేదదీరారు. అక్కడ సామాన్యులను నిత్యావసర ధరలపై ఆరా తీశారు.

  • Loading...

More Telugu News